బిజింగ్: చైనాలో మర్కటాలకు మహా డిమాండ్ ఏర్పడింది. రూ.20-25 లక్షలు పెట్టినా ఒక కోతి దొరకడం గగనంగా మారిపోతున్నది. రానున్న కాలంలో వీటి ధర మరింత పెరిగిపోతుందని అంటున్నారు. బయోటెక్ సెక్టార్ అనూహ్యంగా పెరిగిపోవడమే ఈ కోతుల కొరతకు కారణమని అధికారులు అంటున్నారు.
వైద్య పరిశోధనల్లో భాగంగా నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌కు పెద్దయెత్తున కోతులు అవసరమవుతాయి. అయితే పరిశోధనలకు అవసరమైన సంఖ్యలో కోతులు లభ్యం కాకపోవడంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతున్నది. 2025లో అనేక కొత్త బయో ప్రాజెక్టులు ప్రారంభమైనా కోతుల కొరత కారణంగా పరిశోధనలు మధ్యలోనే ఆగిపోయాయి.