నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరిని నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు చేశారు. రాజ్యసభలో ప్రధాని మోదీ తెలంగాణ అమరవీరులు బలిదానాలను అపహాస్యం చేశారని ఆరోపించారు.
భేషరతుగా తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో మోదీ అండ్ కంపెనీ ఆటలు సాగవన్నారు. కర్నాటకలో మత విద్వేషాలకు బీజేపీయే కారణం అని మండిపడ్డారు.