తిరుమల : శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశ గోవిందా అంటూ భక్తులు తిరుమల ( Tirumala )కు చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న టీటీడీ ( TTD ) కంపార్టుమెంట్లు నిండి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
శనివారం స్వామివారిని 84,176 మంది భక్తులు దర్శించుకోగా 36,673 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.08 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. 4.74 లక్షల లడ్డూలను విక్రయించగా 3.01 లక్షల మందికి అన్న ప్రసాదం అందించినట్లు తెలిపారు.