నర్సంపేట, నవంబర్ 24: కాంగ్రెస్ మోసాల పార్టీ అని, దాన్ని ప్రజలెవరూ నమ్మి ఓటు వేయొద్దని నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. దుగ్గొండి మండలం కేశవపురం, లక్ష్మీపురం, బంధంపల్లి, దేశాయిపల్లి, గుడిమహేశ్వరం, జాఫర్‌పల్లి, తొగరురామయ్యపల్ల్లి, స్వామిరావుపల్లి, మైసంపల్లి కాలనీ, మైసంపల్లి, గోపాలపురం, గొల్లపల్లి, దుగ్గొండిలో శుక్రవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు బతుకమ్మలు, బోనాలు, మంగళహారతులతో పెద్దికి ఘన స్వాగతం పలికారు. జోరు వానలోనూ పెద్ది ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని చేసే దుమ్మున్న నాయకుడికే పట్టం కట్టాలని కోరారు. తాను ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించానన్నారు. కాంగ్రెస్ అసమర్థ నాయకులకు ఓటు వేయొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలకు ఎవరూ బలికావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మొత్తం మళ్లీ అంధకారంలోకి వెళ్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని, ఇక గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలనడం దారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను బంద్ చేసే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు. ఇక ప్రజా సమస్యలను పక్కనబెట్టి సీఎం కుర్చీ కోసం కొట్లాటలు జరుగుతాయని తెలిపారు. తాను నర్సంపేట నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశానని, రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించానని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలా భద్రయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
దుగ్గొండి: మండలం దేశాయిపల్లెలో ప్రచారానికి వచ్చి న పెద్దికి రైతులు ఎడ్లబండ్లతో ఎదురేగి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఎడ్ల బండి ఎక్కి నడిపించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తాను 50 వేల మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ 50 ఎడ్ల బండ్లతో అన్నదాతలు ప్రదర్శన ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని తెలిపారు. మండలంలోని రైతు లు అకాల వర్షాలకు పంట నష్టపోతే సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి పంట పరిశీలన చేసినట్లు గుర్తుచేశారు. అనంతరం ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. రైతులందరూ తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలా భద్రయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
నల్లబెల్లి: కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి ఆగం కావొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదరన్రెడ్డి కోరారు. మండలంలోని నందిగామ, రేలకుంట, నల్లబెల్లిలో 30 కుటుంబాల నుంచి కార్యకర్తలు ఇటీవల కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు. తిరిగి పెద్ది సమక్షంలో వారు సొంత గూటికి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలకుల వల్ల నియోజకవర్గ ప్రజలు ఎంతో నష్టపోయామని, మరోమారు మోసపోవద్దని కోరారు. పార్టీలో చేరిన వారిలో జామలపూడి సుధాకర్, కంచ భిక్షపతి, గుండెబోయిన రాజు, రాములు, చెలుపూరి కిషన్, వాంకుడోత్ శ్రీధర్, అదర్సాండి సుమన్, అంబీర్ ప్రశాంత్, ఎలబోయిన రాజు, దర్శనాదుల సురేశ్, బొజ్జం రాజు, పోరిక వినోద్, కూచన విజయ్, గూడెపు పాపయ్య, జన్ను సాగర్, పరికి సూర్యం, త్రికోవెల వైకుంఠం ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎన్.రాజారాం, నాయకులు సట్ల శ్రీనివాస్‌గౌడ్, సమ్మయ్యనాయక్, జన్ను జయరాజ్, పరికి నవీన్, రాములు, రాజు, హరిబాబు, వేణు, కిశోర్, ప్రవీణ్, సాయికుమార్, కన్నయ్య పాల్గొన్నారు.