హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హౌసింగ్ బోర్డుకు చెందిన పలు ప్లాట్లు, జాగలను ఈనెల 23న వేలం ద్వారా విక్రయించనున్నారు. మంగళవారం హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మేడ్చల్ జిల్లాలోని బౌరంపేట పరిధిలో 2,600 గజాలు, భరత్‌నగర్‌లో 1106 గజాలు, బాలాజీనగర్‌లో 266 గజాలు, చింతల్లో 199 నుంచి 389 గజాల్లోని ఆరు ప్లాట్లు, నిజాంపేట్‌లో 413 గజాలు, రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి హౌసింగ్ బోర్డుకాలనీలో 263,196 గజాల రెండు ప్లాట్లకు వేలంపాట నిర్వహిస్తున్నట్టు తెలిపింది. వివరాలకు హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించింది.