గువాహటి: కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగొయ్లపై రూ.500 కోట్లకు సోమవారం పరువు నష్టం దావా వేసినట్టు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మంగళవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తన కుటుంబం భూ కబ్జాకు పాల్పడిందని తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిమంత కుటుంబం సుమారు 12 వేల బిగాల (3960 ఎకరాలకు పైగా) భూ కబ్జాలకు పాల్పడిందని ఇటీవల గొగొయ్ ఒక మీడియా సమావేశంలో ఆరోపించారు.