చట్ట విరుద్ధ కంటెంట్‌ను 3 గంటల్లోగా తొలగించాలి
యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రభుత్వం మంగళవారం నిబంధనలను కఠినతరం చేసింది. ఇవి ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయి. చట్ట వ్యతిరేక కంటెంట్‌ని 3 గంటల్లోపల తొలగించడం తప్పనిసరి చేయడంతోపాటు, ఏఐ-సృష్టించిన కంటెంట్‌కి, సింథటిక్ కంటెంట్‌కు స్పష్టమైన లేబులింగ్ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ఏఐ కంటెంట్‌కు స్పష్టమైన లేబులింగ్
- నిబంధనలు కఠినతరం
- 20 నుంచి కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రభుత్వం మంగళవారం నిబంధనలను కఠినతరం చేసింది. ఇవి ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయి. చట్ట వ్యతిరేక కంటెంట్‌ని 3 గంటల్లోపల తొలగించడం తప్పనిసరి చేయడంతోపాటు, ఏఐ-సృష్టించిన కంటెంట్‌కి, సింథటిక్ కంటెంట్‌కు స్పష్టమైన లేబులింగ్ అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అశ్లీల, మోసపూరిత, నకిలీ కంటెంట్‌ను సృష్టించడానికి, సర్క్యులేట్ చేయడానికి పెరుగుతున్న ఏఐ దుర్వినియోగానికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
మర్మాంగాలను బహిర్గతం చేసే కంటెంట్, పూర్తి లేదా పాక్షిక నగ్నత్వం లేదా లైంగిక చర్యల విషయంలో నిషేధించిన కంటెంట్‌ను తొలగించడానికి ప్లాట్‌ఫామ్‌లకు స్పందించే వ్యవధిని రెండు గంటలకు ప్రభుత్వం తగ్గించింది. ఈ నిబంధనలు అమలు చేయడానికి ముందు అధికారులు ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్‌లు, సమ్మతి లేని సన్నిహిత చిత్రాలు, వ్యక్తులను అనుకరించే లేదా వాస్తవ ప్రపంచ సంఘటనలను వక్రీకరించే వీడియోలు తరచుగా ఆన్లైన్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. వీటిని అరికట్టేందుకు బాధ్యతను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతోపాటు ఏఐ టూల్స్‌పై కూడా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021ని సవరిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

