హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): వ్యభిచార కూపంలో చికుకున్న వారిని రక్షించిన అనంతరం వారి తరలింపునకు సంబంధించి ప్రభుత్వం గైడ్‌లైన్స్ రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఇందేలె ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అక్రమ లైంగిక కార్యకలాపాల్లో చికుకుని పట్టుబడిన వారిని హోమ్స్‌కు తరలించేటప్పుడు పోలీసులు అనుసరించే పద్ధతులను ప్రజ్వల సంస్థ సవాల్ చేసిన పిటిషన్‌ను జస్టిస్ బశ్యాంకోశీ, జస్టిస్ నర్సింగ్‌రావు బెంచ్ మంగళవారం విచారించింది. వ్యభిచార గృహాల నిర్వాహకులను బాధితులుగా పరిగణించరాదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరా రు. దీనిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ప్రామాణిక విధానాన్ని రూపొందించాలని ధర్మాసనం ఆదేశించింది.