హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణనలో మంగళవారం వరకు 83,64,331 ఇండ్లలో సర్వే పూర్తి అయినట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. 6న ప్రారంభమైన ఈ సర్వే 72% పూర్తయినట్లు చెప్పారు. ములుగు జిల్లా 98.9% పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానం లో నిలిచిందన్నారు. 95 శాతంతో నల్లగొండ జిల్లా ద్వితీయ స్థానంలో, 93.3 శాతంతో జనగామ జిల్లా తృతీ య స్థానంలో నిలిచిందని వెల్లడించా రు. 50.3 శాతంతో జీహెచ్ఎంసీ చివరిస్థానంలో నిలిచిందన్నారు. సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 మంది పర్యవేక్షకులు పాల్గొంటున్నారని చెప్పారు. 52,493 గ్రామీణ, 40,901 అర్బన్ బ్లాకులుగా విభజించి సమగ్ర ఇంటింటి సర్వే చేపడుతున్నామని తెలిపారు.