కొచ్చి : దవాఖానలు ఆధునిక సమాజ దేవాలయాలని, ఆరోగ్య, సంక్షేమ దేవతలను కొలిచేందుకు ప్రజలు అక్కడికి వెళ్తారని కేరళ హైకోర్టు చెప్పింది. అలాంటి దవాఖానలను ధ్వంసం చేయడాన్ని చట్టబద్ధంగా కఠినంగా నిరోధించాలని తెలిపింది. దవాఖాన అంటే కేవలం భౌతిక నిర్మాణం కాదని, ఆశావాదం, సాంత్వనల చిహ్నమని వ్యాఖ్యానించింది. దవాఖానల్లో విధ్వంసాలకు పాల్పడేవారికి బెయిలు మంజూరు చేయడానికి కొన్ని ఆంక్షలు అవసరమని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, సంస్థల విధ్వంసం, హింసాకాండను నిరోధించేందుకు రాష్ట్ర చట్టంలో సవరణలు అవసరమని తెలిపింది.