హైదరాబాద్ : నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి. అహంకారం, అత్యుత్సాహంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం నగరంలోని బీఎన్ రెడ్డి నగర్లో నడి రోడ్డుపై పోకిరీల హంగామా
సృష్టించారు. అంబులెన్స్ డ్రైవర్ ( Ambulance driver ) సైడ్ అడిగినందుకు అంబులెన్స్‌ను ఆపివేశారు. డ్రైవర్‌ను కిందకు దించి కాళ్లు మొక్కించుకొని మరీ చితకబాదారు. పోకిరీలు అడ్డుకున్న మరో ఇద్దరిపై దాడి చేసి గాయపరిచారు. అంబులెన్స్‌లో బాలింత ఉందని చెప్పినా వినకుండా, అరగంట ఆపి నానా హంగామా చేశారు. పోకిరీలు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. పోకిరీలను పోలీసులు గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.