హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి ప్రథమ వర్ధంతిని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని కుటుంబసభ్యులు సమతారెడ్డి, దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘నాయిని ఫౌండేషన్ ట్రస్ట్’ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమని ట్రస్ట్ చైర్మన్ సమతారెడ్డి (నాయుని నర్సింహారెడ్డి కుమార్తె), ఉపాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి (కుమారుడు) తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లోని 42 అంగన్వాడీ కేంద్రాలకు కార్పెట్లను పంపిణీచేశారు.