హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) : కష్టాల్లో ఉన్న క్యాన్సర్ బాధిత జర్నలిస్ట్ ఖాజా కుటుంబానికి బీఆర్ఎస్ నేత భరోసానిచ్చారు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయల కార్తీక్ రూ.50వేలు సమకూర్చగా, గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన నివాసంలో బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఖాజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అధైర్యపడొద్దని, పార్టీపరంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన కార్తీక్ను అభినందించారు. ఆపదలో అండగా నిలిచిన కేటీఆర్, కార్తీక్కు ఖాజా కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందు లో తెలంగాణ ఉద్యమకారుడు సంగారెడ్డి ఉన్నారు.