యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొని హోంగార్డు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ఉపేందర్ చారి (36) రామన్నపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే రాత్రి వాహనాల తనిఖీలో భాగంగా మండల కేంద్రంలో తెల్లవారుజామున సుభాష్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో భువనగిరి నుండి చిట్యాల వైపు వెళ్తున్న కంటైనర్ లారీ అతివేగంగా ఆజాగ్రత్తగా ఆపకుండా అతనిపై నుండి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు . పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ దవఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.