Oscars 2026 | కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ (Oscars 2026) అవార్డుల బరిలో ఈ సంస్థ నుంచి రెండు చిత్రాలు అధికారికంగా చోటు దక్కించుకున్నాయి. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార: చాప్టర్-1’తో పాటు యానిమేషన్ వండర్ ‘మహావతార్ నరసింహ’ చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో నిలిచాయి.
ఈ రెండు చిత్రాలు కేవలం ఉత్తమ చిత్రంగానే కాకుండా.. ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వంటి ప్రధాన కేటగిరీలన్నింటిలోనూ పోటీ పడనున్నాయి. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ‘మేము ఆస్కార్‌కు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం’ అంటూ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సాధించిన విజయం తర్వాత ఇప్పుడు ‘కాంతార: చాప్టర్-1’ పై భారీ అంచనాలు ఉన్నాయి. రిషబ్ శెట్టి సృష్టించిన ఈ విజువల్ వండర్ ఆస్కార్ వేదికపై భారత్ కీర్తిని మరోసారి చాటుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ‘మహావతార్ నరసింహ’ చిత్రంతో యానిమేషన్ విభాగంలోనూ భారత్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
అకాడమీ అవార్డ్స్ విషయానికి వస్తే.. 2026, మార్చి 15వ తేదీన లాస్ ఏంజెలెస్‌లోని ప్రఖ్యాత డాల్బీ థియేటర్లో ఈ వేడుక జరగనుంది. ఈ పోటీలో ఉన్న చిత్రాల నుంచి ఫైనల్ నామినేషన్లను 2026 జనవరి 22న అకాడమీ ప్రకటించనుంది.
Rooted in our culture, driven by divinity.
Proud and privileged as #KantaraChapter1 enters the Best Picture contending race at the #Oscars Academy Awards 2026.#KantaraForOscars#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets… pic.twitter.com/xSCsH28Qjr— Hombale Films (@hombalefilms) January 9, 2026
A sacred journey born from faith, glory, and eternal belief.
Truly honoured and elated as #MahavatarNarsimha enters Best Picture contention at the #Oscars Academy Awards 2026.#MahavatarForOscars#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/CIFlY8nxci— Hombale Films (@hombalefilms) January 9, 2026