న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హెచ్ఐవీ రోగులు ధర్నా చేపట్టారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆఫీసు ముందు రోగులు బైఠాయించారు. యాంటీరెటరోవైరల్ డ్రగ్స్ కొరత ఉన్నట్లు ఆ రోగులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు సమీప రాష్ట్రాల్లో కీలకమైన మందులు లభించడం లేదని హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. మెడిసిన్స్ స్టాక్‌లో లేవని చెబుతున్నారని, ఒకవేళ మందులు లేకుంటే, అప్పుడు దేశం హెచ్ఐవీ ఫ్రీ ఎలా అవుతుందని ఓ రోగి ప్రశ్నించారు.