హైదరాబాద్ : బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, బీసీలను గత పాలకులు ఓటు బ్యాంకు గానే భావించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్‌లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, MLA సుభాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సంద్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..బీసీలు సంఘటితంగా ఉండి అభివృద్ధి సాధించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వం కూడా బీసీల బాగోగులను పట్టించుకోలేదని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు ఉన్నారు.