హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద రోడ్డును పసుపునీటితో శుద్ధి చేశారంటూ నమోదైన కేసులో నిందితులను నేరుగా అరెస్టు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. నిందితులకు నోటీసులు జారీచేసి చట్టప్రకారం ఈ కేసు దర్యాప్తు జరుపాలని పోలీసులకు స్పష్టం చేసింది.
ఈ కేసులో తమను అక్రమంగా అరెస్టు చేసే అవకాశం ఉన్నదన్న అనుమానంతో బీఆర్ఎస్కు చెందిన పలువురు వేర్వేరుగా 3 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేయడంతో జస్టిస్ టీ మాధవీదేవి మంగళవారం పై ఆదేశాలు జారీచేశారు.