కొలంబో: శ్రీలంక జాతీయురాలు, ఆ దేశానికి చెందిన అలనాటి సంప్రదాయ నృత్యకారిణి, 89 ఏండ్ల వజిర చిత్రసేనకు ఇవాళ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శ్రీలంకలోని భారత హైకమిషనర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స సమక్షంలో భారత హైకమిషనర్ అవార్డును అందజేశారు. శ్రీలంక సంప్రదాయ నృత్యరంగానికి వజిర చిత్రసేన ఎనలేని సేవలందించారు.
ఆమె తన అద్భుతమైన నృత్య రీతుల ద్వారా భారత్-శ్రీలంక దేశాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడేందుకు దోహదం చేశారు. అందుకే భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ మేరకు ఇవాళ భారత హైకమిషనర్ చేతుల మీదుగా అందజేసింది. ఈ విషయాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది.
High Commissioner handed over Padma Shri to Dr Vajira Chitrasena today in the presence of PM Mahinda Rajapaksa. She was recognized for her valuable contributions in the field of art further strengthening India-SriLanka cultural ties: High Commission of India in Colombo, Sri Lanka pic.twitter.com/lUaWc6RQc7
— ANI (@ANI) November 17, 2021