న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అంతమొందించాలని ఇరాన్ కోరుకుంటున్నదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకుంటున్న ట్రంప్ ఆ దేశానికి ‘నంబర్ వన్ శత్రువు’గా మారారని, కాబట్టి ఆయనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నదని చెప్పారు. ‘వారు ఆయన (ట్రంప్)ను చంపాలనుకుంటున్నారు.
ఎందుకంటే ఆయన వారికి నంబర్ వన్ శత్రువు’ అని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడని, బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరని, ప్రత్యర్థులకు ఆయన లొంగరని నెతన్యాహు పేర్కొన్నారు. ‘వారి (ఇరాన్) వద్ద అణ్వాయుధం ఉండకూడదు. దీనర్థం వారు యురేనియంను శుద్ధి చేయకూడదు’ అని నెతన్యాహు వివరించారు. తమ దేశం అణుముప్పును ఎదుర్కొంటున్నదని, కాబట్టి దూకుడుగా వ్యవహరించడం తప్ప మరో మార్గం లేదన్నారు.