Hero Glamor | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. తన న్యూ 125సీసీ బైక్ ‘హీరో గ్లామర్.. (Hero Glamor) మార్కెట్లో ఆవిష్కరించింది. అప్డేటెడ్ డిజైన్, అప్డేటెడ్ న్యూ ఫీచర్స్, ఇంజిన్లతో వస్తున్నది. ఈ సెగ్మెంట్లో హోండా ఎస్పీ125, హోండా షైన్, టీవీఎస్ రైడర్, బజాజ్ పల్సర్ 125 బైక్‌లతో హోండా గ్లామర్ (Hero Glamor) తల పడనున్నది.
ఈ బైక్ ఒక లీటర్ ఈ-20 పెట్రోల్‌తో 63 కి.మీ దూరం ప్రయాణిస్తుందని హీరో మోటో కార్ప్ ప్రకటించింది. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో న్యూ గ్లామర్ అందుబాటులో ఉంటుంది. గ్లామర్ డ్రమ్ వేరియంట్ రూ.82,348, డిస్క్ వేరియంట్ రూ.86,348 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
125సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది హీరో గ్లామర్. ఈ ఇంజిన్ గరిష్టంగా 7500 ఆర్పీఎం వద్ద 10.6 హెచ్‌పీ విద్యుత్, 6000 ఆర్పీఎం వద్ద 10.6 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. రెండోదశ బీఎస్-6 ప్రమాణాలతోపాటు ఓబీడీ2 నిబంధనలకు అనుగుణంగా ఈ-20 పెట్రోల్‌తోనూ ఈ బైక్ నడుస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటది. హీరో గ్లామర్ మోటారు సైకిల్ ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) పొందుతుంది.
మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ విత్ శ్రౌడ్స్, సింగిల్-పాడ్ రిఫ్లెక్టర్ హెడ్ లైట్ సెటప్ కలిగి ఉంటుంది. న్యూ డిజైన్ అల్లాయ్ వీల్స్ విత్ సింగిల్ పీస్ గ్రిల్లె రైల్ ఆప్షన్లతో వస్తున్నది. క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
సౌకర్యవంతమైన రైడింగ్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ రేర్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ ఎట్ రేర్, ఫ్రంట్‌లో డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లు ఉంటాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మైలేజీ ఇండికేటర్, ఒడో మీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, మొబైల్ చార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ ఉంటుంది.