క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ పోరులో మిథాలీ బృందం 2 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ (103) సెంచరీతో కదం తొక్కగా.. యస్తిక భాటియా (58) హాఫ్ సెంచరీ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులకు పరిమితమైంది. లౌరా వాల్వర్ట్ (83), సునె లుస్ (86) రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు పడగొట్టింది. కాగా.. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన తలకు బంతి బలంగా తాకడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది.