హైదరాబాద్ : రానున్న మరో రెండు రోజుల పాటు తెలంగాణ ( Telangana ) లో భారీ వర్షాలు ( Heavy rain ) కురుస్తాయని వాతావరణం కేంద్రం ( Meteorological Depart ment) వెల్లడించింది. ప్రస్తుతం తీవ్ర వాయగుండం చత్తీస్ఘడ్ మీద కొనసాగు తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్,నిర్మల్, మంచిర్యాల, జగిత్యాలలో రెడ్ అలెర్ట్, నిజామాబాద్,కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ,మల్కాజ్గిరి, హైదరాబాద్,సిద్దిపేట్, హనుమకొండ, జనగాం, వరంగల్,మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
నాలుగు రోజులు క్రితం వరకు 30శాతం మేరా లోటు వర్షపాతం ఉండగా నేడు ప్రస్తుతం రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సాధారణ వర్షపాతానికి చేరుకున్నామని అధికారులు వెల్లడించారు.