రామాయంపేట, జూలై 23: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జోరు వాన కురిసింది. మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.దీంతో మెదక్-రామాయంపేట రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోయాయి.
ఆసమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న రామయాంపేట విద్యుత్ ఏడీఈ ఆదయ్య, ఏఈ.తిరుపతిరెడ్డి హుటాహుటిన సిబ్బందితో అక్కడికిచేరుకుని మరమ్మతులు చేశారు.రాత్రి నుంచి నిలిచిపోయిన విద్యుత్‌ను పునరుద్ధరించారు.