బిరబిరా కృష్ణమ్మ కదిలొచ్చింది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి పరవళ్లు తొక్కుతున్నది. జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. భారీగా వరద వస్తుండడంతో 17 గేట్లను అధికారులు తెరిచి దిగువనున్న శ్రీశైలానికి వదలుతున్నారు. ఇన్ఫో ్ల90,800 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 1,04,416 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలతోపాటు భీమా లిఫ్ట్‌నకు నీటిని విడుదల చేశారు. ఎగువ, దిగువ హైడల్ ప్రాజెక్టుల్లోని పది యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. అలాగే తుంగభద్ర డ్యాం సైతం 68 టీఎంసీలకు చేరగా.. ఇన్‌ఫ్లో 1,02,744 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,527 క్యూసెక్కులుగా నమోదైంది.
– గద్వాల, జూలై 20
కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో కృష్ణమ్మకు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు జూరాల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గత ఏడాది వర్షాకాంలో వర్షాలు సకాలంలో కురువక పోవడంతో ప్రాజెక్టులు నిండకపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు కురువడంతో ప్రాజెక్టు లు జలకళను సంతరించుకుంటున్నాయి. జలాశయాలకు భారీగా వ రద నీరు వచ్చి చేరుతుండంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా రు. ఈ వానకాలం సాగుకు ఎటువంటి నీటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో జూరాల పరిధిలో రైతులు వరినాట్లు వేయడానికి ఇప్పటికే నార్లు పోసుకోగా ప్రాజెక్టు నిండుతుండడంతో జూరాల కుడి, ఎ డమ కాల్వలకు అధికారులు నీటిని విడుదల చేశారు.
దీంతో రైతులు నాట్లు వేయడానికి తమ పొలాలను చదును చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టుకు సాయంత్రం నాలుగు గంట ల వరకు ఎగువ నుంచి 90,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.600 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.645గా ఉన్నది. ఐదు గేట్ల ద్వారా పవర్‌హౌస్‌కు నీటిని విడుదల చేయగా, మరో 12గేట్ల ద్వారా 66,810 క్యూసెక్కులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నా రు. ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
జూరాలకు ఇన్‌ఫ్లో 90,800 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ ఫ్లో ద్వారా దిగువకు 1,04,416 నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి 33,084 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1,500, భీమా లిఫ్ట్‌కు-1కు 1,300, భీమా లిఫ్ట్-2కు 750, జూరాల ఎడమ కాల్వకు 870, కుడికాల్వకు 467, ప్యారలాల్ కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నది. ముఖ్యంగా నారాయణపూర్ డ్యాం 22 గేట్లు ఎత్తగా దిగువకు 99,225 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూరాల గేట్లు తెరచుకోవడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
అయిజ, జూలై 20 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాం 68 టీఎంసీలకు చేరుకున్నది. తుంగ నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద భారీగా చేరుతున్నది. శనివారం ఇన్‌ఫ్లో 1,02,744 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,527 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1622.31 అడుగుల నీటి మట్టం ఉన్నది. డ్యాం గరిష్ఠనీటి నిల్వ 105.788 సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 68.049 టీఎంసీలకు చేరుకున్నది.