Heart Attack In Bathroom | నిత్యం ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ కారణంగా చాలా మంది గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఎక్కువ శాతం మందికి హార్ట్ ఎటాక్ వస్తుండగా, అది కూడా వారు బాత్ రూమ్‌లో ఉండగానే అలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి బాత్ రూమ్‌లలోనే హార్ట్ ఎటాక్ వస్తుందని అంటున్నారు. అయితే దీని వెనుక బలమైన కారణాలే ఉంటున్నాయని, వీటిని గమనించి జాగ్రత్తగా ఉంటే హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా బాత్ రూమ్‌లో మల విసర్జన చేసినప్పుడు లేదా మూత్ర విసర్జన చేసినప్పుడు శరీరంపై కొన్నిసార్లు ఒత్తిడి బాగా పడుతుంది. అయితే అలాంటప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. దీని వల్ల ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ వస్తుంది. బాత్రూమ్లో హార్ట్ ఎటాక్ వచ్చేందుకు ఇదొక కారణంగా చెప్పవచ్చు. అలాగే కొందరు మలం లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు శరీరంపై బాగా ఒత్తిడిని కలగజేస్తారు. మల విసర్జన చేసినప్పుడు బాగా ఒత్తిడితో చేస్తారు. అలాగే ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకున్నా కూడా విసర్జించేటప్పుడు బాగా ఒత్తిడిని కలగజేస్తారు. దీని వల్ల వేగస్ నాడిపై ఒత్తిడి పడి భారం పెరుగుతుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ సంభవిస్తుంది.
ఇక కొందరు మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా భారీ మార్పులు వస్తాయి. దీని వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్‌కు కారణమవుతుంది. కనుక ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు గాను గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే కొందరు బెడ్ మీద నుంచి లేచి వెంటనే హడావిడిగా బాత్రూమ్కు పరుగెత్తుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. దీని వల్ల కూడా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఫలితంగా అది హార్ట్ ఎటాక్ కు దారి తీస్తుంది. కనుక బెడ్ మీద నుంచి లేచిన తరువాత వెంటనే కిందకు దిగకూడదు. నెమ్మదిగా పనులు చేసుకోవాలి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించవచ్చు.
బాత్ రూమ్‌లో మూత్రం లేదా మల విసర్జన చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి కలగజేయకూడదు. అలాగే మలం, మూత్రాన్ని ఎక్కువ సేపు బంధించకూడదు. ఇది గుండెపై భారం పడేయడం మాత్రమే కాదు, కిడ్నీలపై కూడా భారం కలిగేలా చేస్తుంది. దీని వల్ల మూత్రాశయ వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. కనుక మలమూత్రాలను ఎక్కువ సమయంపాటు బంధించి ఉంచకూడదు. అలాగే స్నానం చేసేటప్పుడు కాస్త గోరు వెచ్చగా ఉన్న నీటితోనే స్నానం చేయాలి. మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉన్న నీళ్లను స్నానానికి ఉపయోగించకూడదు. అలాగే తలస్నానం చేసేటప్పుడు ముందుగా నీళ్లను తలపై కాకుండా కొన్ని నీళ్లను పాదాలపై పోసుకోవాలి. తరువాత నీళ్లను తలపై పోసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాత్ రూమ్‌లో హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.