Yashasvi Jaiswal : సుదీర్ఘ ఫార్మాట్లో నయా థౌజండ్వాలాగా, రన్ మెషీన్‌గా రికార్డులు బద్దలు కొట్టిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(100 నాటౌట్) వన్డేల్లోనూ శతకం శతకంతో చెలరేగాడు. వైజాగ్ వన్డేలో ఆద్యంతం జాగ్రత్తగా ఆడిని యశస్వీ.. తన తొలి హాఫ్ సెంచరీనే వందగా మలిచాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఈ చిచ్చరపిడుగు మూడంకెల స్కోర్ అందుకున్నాడు. మొత్తంగా.. మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన ఆరో భారత క్రికెటర్‌గా యశస్వీ చరిత్ర లిఖించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్న యశస్వీ ఇప్పుడు మరో రికార్డు నెలకొల్పాడు. వైజాగ్ వన్డేలో ఓపికగా ఆడి సెంచరీ బాదిన ఈ యంగ్‌స్టర్ మూడు ఫార్మట్‌లో శతక యోధుడిగా అవతరించాడు. యశస్వీ కంటే ముందు ఆరుగురు భారత క్రికెటర్లు ఈ ఫీట్ నమోదు చేశారు. వీరిలో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా ఉన్నారు. వీరిలో రైనా మినహా మిగతా నలుగురు ఇంటర్నేషనల్ క్రికెట్లో కొనసాగుతున్నారు.
Maiden ODI HUNDRED for Yashasvi Jaiswal! 💯
He becomes the 6⃣th #TeamIndia batter in men’s cricket to score centuries in all three formats 🙌
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/dBzWmU6Eqh
— BCCI (@BCCI) December 6, 2025
Look at what it means to him! 🥳
What a special knock this has been from Yashasvi Jaiswal 🙌
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/BHyNjwOGWY
— BCCI (@BCCI) December 6, 2025