Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Health tips | బొబ్బర్లనే అలసందలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం (ఫైబర్) కూడా ఎక్కువ. అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి.
Health tips : బొబ్బర్లనే అలసందలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం (ఫైబర్) కూడా ఎక్కువ. అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి. జీర్ణశక్తికి కూడా తోడ్పడుతాయి. శరీరంలో విషాలను తొలగిస్తాయి. మరి బొబ్బర్లతో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు
అధిక బరువుతో బాధపడే వారికి బొబ్బర్లు మంచి ఉపయోగకరమైన ఆహారం. బొబ్బర్లలో క్యాలరీలతోపాటు కొవ్వులు కూడా తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
మధుమేహులకు లో-గైసిమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.
బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంగా తీసుకోవడంవల్ల పోషకాహార లోపంతో వచ్చే కొన్నిరకాల వ్యాధులు ధరిచేరవు. ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి.
బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. అంతేగాక హృదయ సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. బొబ్బర్లలోని ఫ్లెవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి.
అదేవిధంగా బొబ్బర్లలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బొబ్బర్లలోని అధిక ప్రొటీన్ కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సి చర్మ కణాలను రక్షిస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్
AP News | ముంచుకొస్తున్న ‘మురసు’.. ఏపీ సర్కారు అప్రమత్తం.. విద్యాసంస్థలకు సెలవు..!
Imran Khan:హైకోర్టులో బేషరతు క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

