AP News | ముంచుకొస్తున్న ‘మురసు’.. ఏపీ సర్కారు అప్రమత్తం.. విద్యాసంస్థలకు సెలవు..!
AP News | ఆంధ్రప్రదేశ్ తీరంవైపు మురసు తుపాను ముంచుకొస్తున్నది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మంగళవారం స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారికంగా ఆదేశాలు జారీచేశారు.
AP News : ఆంధ్రప్రదేశ్ తీరంవైపు మురసు తుపాను ముంచుకొస్తున్నది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. మంగళవారం స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారికంగా ఆదేశాలు జారీచేశారు. భారత వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. ‘మురసు’ తీవ్ర తుపానుగా బలపడి, నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3న తెల్లవారుజాము వరకు నెల్లూరు–నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరందాటే అవకాశం ఉంది.
తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగానికి చేరవచ్చని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుందని అధికారులు స్పష్టంచేశారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీచేసింది.
విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఈ సెలవులను తదుపరి ప్రభుత్వ సెలవు రోజుల్లో భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ముంచుకొస్తున్న ‘మురసు’.. ఏపీ సర్కారు అప్రమత్తం.. విద్యాసంస్థలకు సెలవు..!
Imran Khan:హైకోర్టులో బేషరతు క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
Laugh | మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో దోహదం చేసే నవ్వు.. బలవంతంగా నవ్వకూడదు.. వెల్లడించిన పరిశోధకులు..
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

