Imran Khan:హైకోర్టులో బేషరతు క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
Imran Khan: సర్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన ముంబై హైకోర్టు ముందు బేషరతు క్షమాపణలు చెప్పారు. అమెరికా పౌరుడివై ఉండి ఎలా నిరసనల్లో పాల్గొన్నావని కోర్టు ఆయన్ను మందలించింది.
న్యూఢిల్లీ: సర్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో నటుడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఆయన ముంబై హైకోర్టు ముందు బేషరతు క్షమాపణలు చెప్పారు. అమెరికా పౌరుడివై ఉండి ఎలా నిరసనల్లో పాల్గొన్నావని కోర్టు ఆయన్ను మందలించింది. చీఫ్ జస్టిస్ మహేశ్ చంద్ర నేతృత్వంలో బెంచ్ ఆ కేసును విచారించింది. ఒకవేళ భారతీయ వ్యక్తి అమెరికాలో నిరసన చేపడితే, అప్పుడు ఆ దేశం ఎలా రియాక్ట్ అయి ఉండేదని కోర్టు ప్రశ్నించింది. నిరసన ప్రదేశానికి ఎందుకు వెళ్లావని కోర్టు అడిగింది. భారత పౌరుల హక్కులు, ఓసీఐ కార్డు హోల్డర్ల మధ్య చాలా తేడా ఉందని, నిరసనల కోసం అక్కడకు వెళ్లావా లేక మరేదైనా పని ఉందా అని కోర్టు ప్రశ్నించింది.
నిరసనలతో సంబంధం లేదని ప్రకటన చేయాలని కోర్టు పేర్కొన్నది. ఎందుకంటే నిరసన అనేది సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతోందని, దానికి మీకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పింది. మీరు భారతీయ పౌరుడు కాదు కాబట్టి, ఆ నిరసనల్లో పాల్గొనడం చట్ట వ్యతిరేకం అవుతుందని కోర్టు పేర్కొన్నది. ఒకవేళ అమెరికాలోనే భారతీయ పౌరుడు నిరసనలో పాల్గొని ఉంటే, అప్పుడు ఆ వ్యక్తిని తక్షణమే విమానం ఎక్కించేవాళ్లు అని కోర్టు అభిప్రాయపడింది.
ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు చెప్పడంతో ఈ కేసులో విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. భారత్‌ను విడిచి వెళ్లాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను పెండింగ్‌లో పెట్టింది. అక్టోబర్ 28వ తేదీలోగా ఇమ్రాన్ దేశం విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ గతనెలలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan:హైకోర్టులో బేషరతు క్షమాపణలు చెప్పిన ఇమ్రాన్ ఖాన్
Laugh | మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఎంతో దోహదం చేసే నవ్వు.. బలవంతంగా నవ్వకూడదు.. వెల్లడించిన పరిశోధకులు..
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

