Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటన.. ఏపీ హైకోర్టులో పిటిషన్
Raptadu case | అనంతపురం జిల్లా రాప్తాడు నిందితుడు హేమంత్ పై పోలీసులు జరిపిన కాల్పులపై ఏపీ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి : అనంతపురం జిల్లా రాప్తాడు ( Raptadu ) నిందితుడు హేమంత్ ( Hemanth ) పై పోలీసులు జరిపిన కాల్పులపై ఏపీ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అతడిని ఆసుపత్రిలోకి ఈడ్చుకెళ్లిన వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. నిందితుడుపై ఆరు రౌండ్ల కాల్పులు జరపాల్సిన అవసరం ఏమిటి ? కాల్పుల సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటో తెలియజేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.
నిందితుడి కాళ్లకు బుల్లెట్ గాయాలతో పాటు ముఖంపై కూడా గాయాలు అయ్యాయని తెలిసింది. అవి ఎలా ఏర్పడ్డాయి, వాటికి కాల్పులతో సంబంధం ఉందా? అటవీ ప్రాంతంలో పడిపోవడం వల్లే గాయాలయ్యాయన్న పోలీసుల వివరణలో వాస్తవమెంత అనే అంశాలను వైద్య, ఫోరెన్సిక్ ఆధారాలతో నిర్ధారించాలని కోరారు. గాయపడిన వ్యక్తిని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆసుపత్రిలోకి ఈడ్చుకెళ్లడం వల్ల అతడి గాయాలు మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని, వీటిపై విచారణ జరపాలని పిటిషనర్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై శనివారం ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డువచ్చిన మరో విద్యార్థినిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధిత బాలిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

