చాలా మంది బిజీ లైఫ్‌లో పడిపోయి ఏ రోజుకారోజు తినాల్సిన తాజా కూరగాయలు, పండ్లను వారానికి సరిపడా తీసుకొచ్చి ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటున్నారు. ఎంత ఫ్రిజ్‌లో స్టోర్ చేసినా వారం తిరిగేసరికి అవి తాజాదనం కోల్పోతాయి. కొంతమంది కూరగాయలు తీసుకురాగానే అన్నింటినీ ఒకే ట్రేలో వేసి స్టోర్ చేస్తుంటారు. దీనివల్ల త్వరగా పాడైపోవడం ఖాయం. అలాకాకుండా ఎక్కువ రోజులపాటు కూరగాయలు పాడవకుండా తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్‌ను పాటిస్తే సరిపోతుంది.
ఐస్ క్యూబ్ ట్రేడ్: నెలల తరబడి కూరగాయలు తాజాగా ఉండాలంటే.. వాటిని కట్ చేసి ఐస్ ట్రేలో వేసి నూనె, నీరు వేసి ఫ్రీజ్ చేయండి. వీటిని మీరు కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా వంటల్లో వేయండి. అయితే, నూనె వేసి ఫ్రీజ్ చేసినప్పుడు వంటల్లో వేసే నూనె ఎకువగా వేయకుండా జాగ్రత్తపడాలి. దీంతో ఆయిల్ ఎకువగా ఉండకుండా రుచికరంగా ఉంటుంది.
తడిపిపెట్టి: కొత్తిమీర, మెంతి, పుదీనా తదితర ఆకుకూరలు నిల్వ చేయడానికి వాటి చుట్టూ పేపర్ టవల్ని తడిపి చుట్టండి. లేదంటే ఓ అంగుళం నీరు ఉన్న గ్లాసులో నిలువుగా పెట్టి స్టోర్ చేయండి. దీనివల్ల అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
కంటెయినర్స్‌లో: ఎక్కువ మొత్తంలో తీసుకునే ఆహారపదార్థాలు చాలా రోజులు నిల్వచేయాలంటే గాలి చొరబడని కంటెయినర్స్‌లో భద్రపరచాలి. ఎయిర్ కంటెయినర్స్‌లో బెర్రీస్, టమాటలు, పుట్టగొడుగులు, మసాలా దినుసులను స్టోర్ చేస్తే.. అవి చాలాకాలం మన్నుతాయి.