శంషాబాద్ రూరల్: నిరుపేదలకు కార్పోరేట్ వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటుంబసభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన గోపినాథ్‌కు 60,000/, గచ్చుభాయ్ తండాకు చెందిన శాంతికి 12,000/, మదన్‌పల్లి పాతతండా వి.సాల్యకు35,000/, చౌదర్‌గూడకు చెందిన రామకృష్ణ కు 27,000/, చెక్కులను ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, వైస్‌ఎంపీపీ నీలంనాయక్, సర్పంచ్‌లఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి,సీనియర్ నాయకుడు నీరటి రాజు ముదిరాజ్, సర్పంచ్‌లు దేవానాయక్, రవీనాయక్, తుల్చనాయక్,నాయకులు ఆంజనేయులుగౌడ్, గోపాల్, రాజశేఖర్‌గౌడ్, చందునాయక్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.