హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. సీబీఐని ఉద్దేశించి రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణలో రాహుల్ గాంధీకి కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తమపై ఎన్ని కుట్రలు చేసినా.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. న్యాయయ వ్యవస్థ, ప్రజలపై తమకు నమ్మకం ఉంది. సత్యమేవ జయతే’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్‌ను కూడా కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. ‘సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు ఇప్పుడు బీజేపీకి విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్‌గా మారిపోయాయి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నదంటూ రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు.
The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBI
The very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJP
Have you any clue Mr. Gandhi on what your CM is doing?
Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd
— KTR (@KTRBRS) September 1, 2025