హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు. మేడిగట్ట నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.84 వేల కోట్లు అయితే, కేవలం తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత-చేవెళ్లకు రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నారని చెప్పారు. రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వరట అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
‘మేడిగడ్డ టు మల్లన్న సాగర్ – మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడిహెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 TMC అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 TMC మాత్రమేనట. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట. 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం. ఇది కదా అసలైన మార్పంటే?’ అంటూ మాజీ హరీష్రావు ట్వీట్ చేశారు.
మేడిగడ్డ టు మల్లన్న సాగర్ – మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట!
కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2025