ముంబై: యాపిల్ ఐఫోన్లకు (Apple iPhone) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హై సెక్యూరిటీ ఫీచర్లు, స్టైలిష్ లుక్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీతో తయారయ్యే ఈ ఫోన్లను ఎలాగైనా కొనాలని యువత తెగ ముచ్చట పడుతుంటారు. దీనికి అనుగుణంగా ప్రతి ఏటా తన ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తూ సరికొత్త సిరీస్‌ను యాపిల్ పరిచయం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్‌ను (iPhone 17 Series) లాంచ్ చేసింది. తాజాగా ఆ మోడల్ భారత్‌లోని స్టోర్లలోనూ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి విక్రయాలు ప్రారంభించింది. ఇంకేముంది ముంబై, ఢీల్లీలో జనం యాపిల్ స్టోర్ల (Apple Store) ముందు బారులు తీరారు. ముంబైలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచే యువత క్యూలైన్లలో నిల్చున్నారు. బీకేసీ జియో సెంటర్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడిన యువత.. క్యూలైన్లో ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు, స్టోర్ సిబ్బంది కలుగజేసుకుని యువకులను శాంతిపజేశారు. ఇక ముంబైలోనూ యాపిల్ స్టోర్ వద్ద భారీగా యువకులు క్యూలైన్లలో వేచిఉన్నారు.
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌తో పాటు యాపిల్ చరిత్రలో మొట్టమొదటి ఐఫోన్ ఎయిర్ కూడా ఉంది. ఈ కొత్త ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 11, యాపిల్ వాచ్ అల్ట్రా 3, యాపిల్ వాచ్ SE3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3 కూడా లాంచ్ అవుతున్నాయి. కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో రూపొందించిన ఐఫోన్ ఎయిర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఐఫోన్ 17 సిరీస్‌లో.. 17 ప్రొ, 17 ప్రొ మ్యాక్స్ పేరుతో ఈ ఫోన్లను విడుదల చేశారు. ఈ రెండు ఫోన్లు టైటానియం డిజైన్‌ను కలిగి ఉన్నాయి. రెండింటిలోనూ ఎ19 ప్రొ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 17 ప్రొ ఫోన్ 6.3 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉండగా, 17 ప్రొ మ్యాక్స్‌లో 6.9 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. రెండు ఫోన్ల డిస్ప్లేలకు ప్రొ మోషన్ ఫీచర్ లభిస్తుంది. అలాగే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లేల క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ డిస్ప్లేలకు 3000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. కనుక సూర్యకాంతిలోనూ స్పష్టంగా చూడవచ్చు.
#WATCH | Maharashtra: Apple begins its iPhone 17 series sale in India; a large number of people throng the company’s store in Mumbai’s BKC pic.twitter.com/8XXm0lk445
— ANI (@ANI) September 19, 2025
ఈ ఫోన్లలో ఏర్పాటు చేసిన యాపిల్ ఎ19 ప్రొ ప్రాసెసర్ గత ఐఫోన్లలోని ప్రాసెసర్ల కన్నా అత్యంత వేగంగా పనిచేస్తుందని యాపిల్ తెలియజేసింది. గతంలో వచ్చిన ఐఫోన్లలోని ఎ18 ప్రొ కన్నా ఎ19 ప్రొ ప్రాసెసర్ చాలా వేగంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా ఎన్1 పేరిట ఓ నెట్వర్కింగ్ చిప్‌ను ఇచ్చారు. దీని సహాయంతో వైఫై 7, బ్లూటూత్ 6 సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇవి యూజర్లకు అత్యుత్తమ కనెక్టివిటీని ఇస్తాయి. ఐఫోన్ 17 ప్రొ ఫోన్లలో వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన ట్రిపుల్ కెమెరాలను ఇచ్చారు. అందులో ఒకటి 48 మెగాపిక్సల్ ఫ్యుషన్ కెమెరా కాగా మరొకటి 48 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌గా ఉంది. అలాగే మరో 48 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరాను సైతం ఇచ్చారు. ఈ కెమెరా ద్వారా ఏకంగా 4ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను పొందవచ్చు. ముందు వైపు 18 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఐఫోన్ 17 ప్రొ సిరీస్ ఫోన్లను అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌తో రూపొందించారు. కనుక ఫోన్లకు అద్భుతమైన ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ఫోన్లకు కూడా ముందు వైపు సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను ఇస్తున్నారు. ఈ ఫోన్లకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 20 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. 40 వాట్ల వరకు ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. ఈ ఫోన్లను 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్లలో పొందవచ్చు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. ఒకటి నానో సిమ్ కాగా ఒకటి ఇ-సిమ్గా పనిచేస్తుంది. రెండింటిలోనూ వేగవంతమైన 5జిని పొందవచ్చు. గిగాబిట్ ఎల్టీఈ, ఎన్ఎఫ్సీ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. 25 వాట్ల వరకు వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది.
#WATCH | Maharashtra: A large number of people throng the Apple store in Mumbai’s BKC as the company begins its iPhone 17 series sale in India from today pic.twitter.com/f6DOcZC5Yk
— ANI (@ANI) September 19, 2025
ఐఫోన్ 17ప్రొ, 17 ప్రొ మ్యాక్స్ ఫోన్లను సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లకు గాను 128జీబీ మోడల్‌ను అందించడం లేదు. 17 ప్రొ మ్యాక్స్ మోడల్ మాత్రం 2టీబీ స్టోరేజ్ ఆప్షన్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్లకు చెందిన ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రొకు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,34,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,54,900గా ఉంది. అలాగే 1టీబీ మోడల్ ధరను రూ.1,74,900గా నిర్ణయించారు. ఇక ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ ఫోన్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,49,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,69,900గా ఉంది. 1టీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.1,89,900గా నిర్ణయించారు. 2టీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.2,29,900గా ఉంది.
#WATCH | Long queues seen outside the Apple store in Mumbai’s BKC
Apple started its iPhone 17 series sale in India today. pic.twitter.com/FjXVA8x8sy
— ANI (@ANI) September 19, 2025
#WATCH | Long queues seen outside the Apple store in Delhi’s Saket
Apple started its iPhone 17 series sale in India today. pic.twitter.com/mjxZAFheWC
— ANI (@ANI) September 19, 2025