Harish Rao | గురుకులాల్లో టెండర్లలో(Gurukulala tenders) అవినీతి ఆరోపణలపై చర్చల్లో ట్విస్టు చోటు చేసుకుంది. కేటీఆర్, హరీశ్ రావు(Harish Rao) గన్‌పార్క్‌కు రావాలని మంత్రులు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో గురుకులాల్లో అవినీతిపై చర్చకు హరీశ్ రావు సిద్ధమయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి గన్‌పార్క్ బయలు దేరారు. గురుకులాలపై చర్చకు మేము ప్రెస్‌క్లబ్ రమ్మంటే మంత్రులు గన్‌పార్క్ రమ్మన్నారు.
మాకు ఎలాంటి భేషజాలు లేవు. మీరు రమ్మన్నారు మేము వస్తున్నామని తెలిపారు. చర్చకు ఎక్కడికైనా మేము సిద్ధమని పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు వద్దు కూర్చొని మాట్లాడుకుందామన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారికి టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. ఒకవేళ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వెళ్తే..కేటీఆర్ చర్చించేందుకు రెడీ ఉన్నారని పేర్కొన్నారు.
కాగా, గన్‌పార్క్‌కు బయలు దేరిన హరీశ్ రావును పోలీసులు అడ్డుకోవడంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముగ్గురు మంత్రులు రమ్మంటేనే మేము వెళ్తున్నాం. ఎందుకు ఆపుతున్నారని పోలీసులను ప్రశ్నించారు. కావాలంటే మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేయాలని పోలీసులకు సూచించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని చర్చలను అడ్డుకుంటుందని హరీశ్ రావు మండిపడ్డారు.