Jailer2 | వేటకు సిద్ధమైన టైగర్.. ‘జైలర్ 2’ నుంచి ఈరోజు సాయంత్రం క్రేజీ అప్డేట్!
Jailer2 | సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు చిత్ర నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చింది.
Jailer2 | సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు చిత్ర నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) నుంచి ఈరోజు (గురువారం) సాయంత్రం 6 గంటలకు ఒక భారీ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
‘ది టైగర్ ఈజ్ బ్యాక్ ఆన్ ది హంట్!’ (టైగర్ మళ్లీ వేటకు సిద్ధమయ్యాడు) అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సన్ పిక్చర్స్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకోని విడుదలకు సిద్ధమవుతుంది. 2023లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈరోజు సాయంత్రం రాబోయే అప్డేట్ గ్లింప్స్, పోస్టర్ లేదా విడుదల తేదీకి సంబంధించి ఉంటుందని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

