Harish rao | గురుకులాల్లో(Gurukulala tenders) అవినీతిపై చర్చకు సిద్ధమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం హరీశ్ రావుపై(Harish rao) కర్కశాన్ని ప్రదర్శించింది. మంత్రుల ఆహ్వానం మేరకు గన్‌పార్క్ బయలు దేరిన హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకుల బృందాన్ని తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా నెట్టేయడంతో హరీశ్ రావు కిందపడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. పోలీసుల తీరు నిరసిస్తూ తెలంగాణ భవన్ ఎదుట రోడ్డుపై హరీశ్ రావు, బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
సవాల్ విసిరి పారిపోయిన ప్రభుత్వం.
విద్యాశాఖ అవినీతిపై చర్చకు పిలిచి చర్చకు బయలుదేరిన @BRSHarish గారిని, బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తున్నాం.. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకని ప్రశ్నించిన హరీశ్ రావు గారు
ముగ్గురు మంత్రులకు… pic.twitter.com/wymP6Qppg2
— Office of Harish Rao (@HarishRaoOffice) July 2, 2026