Harish Rao | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడటానికి డాక్టర్ మమతారెడ్డి ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశంసించారు. అంకితభావంతో పనిచేసి ప్రాణాలు కాపాడిన మమతారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
గుండె ఆగిపోయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అనేక దఫాలుగా సీపీఆర్ చేసి, ఆశ వదులుకోకుండా గుండె లయను డాక్టర్ మమతారెడ్డి పునరుద్ధరించారని హరీశ్‌రావు తెలిపారు. ఎంతో ఒత్తిడిలోనూ అసాధారణమైన నైపుణ్యాన్ని, ధైర్యాన్ని నిబద్ధతను ప్రర్శించారని పేర్కొన్నారు. డాక్టర్ మమతారెడ్డి అందించిన సేవలు ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. పెద్దిసుదర్శన్ రెడ్డి అన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడటంలో డాక్టర్ మమతా రెడ్డి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారనే చెప్పాలి. హార్ట్ ఎటాక్‌తో అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని తన పట్టుదలతో శ్రమించి కాపాడారు. గుండెపోటుతో ఇవాళ ఉదయం హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చేరిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి మమతా రెడ్డి ఎమర్జెన్సీ చికిత్స అందించారు. ఆయన ప్రాణం కాపాడటానికి తీవ్రంగా శ్రమించారు. ఏకధాటిగా ఎనిమిది సార్లు సీపీఆర్ చేశారు. ఎలాంటి స్పందన లేకయినప్పటికీ వెనక్కితగ్గకుండా గుండె నిబ్బరంతో మళ్లీ ప్రయత్నించారు. చివరకు 9వసారికి సీపీఆర్ సక్సెస్ అయ్యింది. గుండె లయ కొట్టుకోవడం మొదలైంది. దీంతో ఎమర్జెన్సీ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
My heartfelt gratitude to Dr. Mamatha Reddy for her extraordinary dedication and relentless efforts in saving the life of our dear colleague and former MLA, Peddi Sudarshan Reddy garu.
By refusing to give up and successfully reviving his heartbeat after multiple rounds of CPR,… pic.twitter.com/qedFDdzfE3
— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2026