తెలంగాణ ఉద్యమంలో పీటీ స్వామిది కీలకపాత్ర
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటులో పీటీ స్వామి చేసిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు.
- సంస్మరణ సభలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు
- స్వామి మృతి బాధాకరం: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
గోదావరిఖని/ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 1: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏర్పాటులో పీటీ స్వామి చేసిన కృషి మరువలేనిదని బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ రామగుండం నియోజకవర్గ, టీబీజీకేఎస్ సంయుక్త ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పీటీ స్వామి సంస్మరణ సభ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే పార్టీలో చేరిన ఆయన, 26 ఏండ్లుగా పార్టీకి విశేష సేవలందించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత గౌరవించే వ్యక్తి పీటీ స్వామి అని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో తన సొంత డబ్బులతో ఈశ్వర కృప ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
వృద్ధాశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పీటీ స్వామి గుర్తుగా గోదావరిఖని ప్రాంతంలో కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని వివరించారు. ఆయన పెద్దకుమారుడు పీఎస్ అమరేందర్ నివాసానికి వెళ్లి పీటీ స్వామి చిత్రపటం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీటీ స్వామి అకాల మరణం బాధాకరమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసి, పార్టీకి గొప్ప సేవలందించారని చెప్పారు. తనకు చదువు చెప్పిన గురువే కాక, తండ్రితో సమానమైన ఆయన చివరి చూపునకు అనివార్య కారణాలతో హాజరుకాలేకపోవడం తీరనిలోటని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

