బీ3 భూములతో దోబూచులాట
కంటోన్మెంట్‌కు చెందిన బీ3 భూముల విషయంలో హెచ్ఎండీఏ దోబూచులాడుతోంది. ఓవైపు ప్రైవేటు ఆస్తుల సేకరణ అంశం పక్కనపెట్టి.. మరోవైపు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండే బీ3 ల్యాండ్ భూముల పేరిట ప్రాజెక్టును కాలయాపన చేసేందుకు సన్నద్ధం అవుతుంది.
- పరిహారం తేల్చకుండా నాన్చుతున్న హెచ్ఎండీఏ
- గతంలోనే పరిహారం ఇవ్వలేమని చెప్పిన యంత్రాంగం
- బాధితులను చర్చలకు పిలిచిన హెచ్ఎండీఏ కమిషనర్
సిటీబ్యూరో, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): కంటోన్మెంట్‌కు చెందిన బీ3 భూముల విషయంలో హెచ్ఎండీఏ దోబూచులాడుతోంది. ఓవైపు ప్రైవేటు ఆస్తుల సేకరణ అంశం పక్కనపెట్టి.. మరోవైపు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండే బీ3 ల్యాండ్ భూముల పేరిట ప్రాజెక్టును కాలయాపన చేసేందుకు సన్నద్ధం అవుతుంది. ఇన్నాళ్లు ఈ భూములకు హక్కుదారుడిగా కంటోన్మెంట్ ఉండగా.. వాటిని స్థానికులకు లీజు ప్రాతిపదికన కేటాయించినట్లుగా పేర్కొంది. వీటికి పూర్తి యాజమాన్యపు హక్కులు తమకు ఉన్నాయని కంటోన్మెంట్ ..స్పష్టం చేసినా.. లీజుదారులతో హెచ్ఎండీఏ ఆటలాడుతోంది. దశాబ్దాల కాలంగా ఈ భూములే ఆధారంగా బతికిన వారికి హక్కులు లేవంటూనే..
పరిహారం గురించి చర్చించాలంటూ హెచ్ఎండీఏ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటుంది. 42 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2వేల వరకు బీ3 కేటగిరి ఆస్తులు ఉన్నాయి. ఈ భూములన్నీ కంటోన్మెంట్‌కు చెందినవి. జీవనోపాధి కోసం నిరుపేదలకు దశాబ్దాల కిందటే అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ భూములే ఆదాయ వనరులుగా నివాస, వ్యాపార భవనాలను నిర్మించుకున్నారు. కానీ హెచ్ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఈ భూముల అనుభవదారులకు ప్రమాదంగా మారింది. ముఖ్యంగా 16 కిలోమీటర్ల జేబీఎస్ నుంచి తూంకుంట వరకు నిర్మించే ఎలివేటెడ్ కోసం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే 250 మందికి పైగా ఈ భూములతో కుటుంబాలను పోషిస్తున్నారు.
కానీ ఈ భూములను 90 ఏళ్ల తర్వాత కంటోన్మెంట్ బోర్డు మాత్రం తీసుకునేందుకు సిద్ధమైంది. రక్షణ శాఖకు చెందిన ఈ భూములను స్థానిక ప్రజా అవసరాల కోసం వినియోగించే ప్రైవేటు ఆస్తులు, వీటిని రెసిడెన్షియల్, వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వాడుకోవచ్చని రక్షణ శాఖ భూముల రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూములను ఎప్పుడో 90 ఏళ్ల కిందటే వీరికి అప్పగించగా, వారసత్వంగా వచ్చిన భూమిని ఆధారంగా చేసుకుని పక్కా నిర్మాణాలను చేపట్టుకున్నారు. ఎక్కడ యాజమాన్యపు హక్కులను ఇవ్వలేదని కంటోన్మెంట్ బోర్డు పేర్కొంది.
పరిహారం ఆశజూపి రాజకీయం..
నిజానికి ఈ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న బీ3 భూములపై అనుభవదారులకు ఎలాంటి యాజమాన్యపు హక్కులు లేవని తేల్చిన తర్వాత.. హెచ్ఎండీఏ నుంచి కంటోన్మెంట్ బోర్డుకు పరిహారంగా దాదాపు రూ. 350 కోట్లు మంజూరు చేసింది. వీటిని రక్షణశాఖ భూములుగానే పేర్కొంది. కానీ ఇప్పుడు స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో రాజకీయానికి తెరలేపడంతో జనాలు గందరగోళానికి గురవుతున్నారు. గతంలోనే కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం ఉన్న ఆస్తులను లాక్కొనేందుకు ప్రయత్నించగా, కొందరు అనుభవదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో వందలాది కుటుంబాలను ఊరిస్తున్న సర్కారు.. భూ పరిహారం పేరిట జనాలను మభ్యపెడుతూనే ఉంది. అయితే దీనిపై స్పష్టతనివ్వాల్సిన హెచ్ఎండీఏ కూడా కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతూ, బీ3 భూముల్లో ఉంటున్న అనుభవదారులను ఊరిస్తూ ఆశపెడుతుంది.
పట్టాదారులకే అతీగతీ లేని పరిహారం..
నిజానికి ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న పట్టాదారుల ఆస్తులకే పరిహారం విషయంలో అతీగతీ లేకుండా పోయింది. దాదాపు 630కి పైగా మంది బాధితులు ప్రభుత్వంతో తమకు ప్రయోజనం జరగదని తెలిసి కోర్టులో పోరాటం చేస్తున్నాం. చట్టబద్ధమైన పరిహారం ఇస్తే గానీ భూములు ఇవ్వలేమంటున్నారు. వీరి విషయంలోనే హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. కానీ హక్కులేని బీ3 భూములకు పరిహారం ఇస్తామని ఆశచూపడమే అవుతుందని కొందరు ప్రభావిత ప్రాంత ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. వారికి ఎలాంటి హక్కు లేదని చెబుతూనే, ఎందుకు చర్చలకు పిలుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

