నకిలీ నోట్ల కలకలం
జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ నోట్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) బాంబ్ డిటెక్షన్ స్కాడ్ సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు.
- రూ. 60 లక్షల ఫేక్ నోట్లతో పట్టుబడ్డ యువకుడు
- జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలింపు..
- వివరాలను వెల్లడించిన రైల్వే డీఎస్పీ జావెద్,
- జైపూర్ నుంచి ముంబైకి తరలిస్తుండగా యువకుడి అరెస్టు
- వివరాలను వెల్లడించిన రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్
మారేడ్‌పల్లి, నవంబర్ 1 : జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన నకిలీ నోట్లను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) బాంబ్ డిటెక్షన్ స్కాడ్ సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా శ్రీడూంగర్ గఢ్ ప్రాంతానికి చెందిన శివరతన్ మహియా(19)కు కొన్ని నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓం ప్రకాశ్‌తో పరిచయం ఏర్పడింది. నకిలీ కరెన్సీ నోట్లను సేకరించి, వాటిని ముంబైకి తరలించి తన అనుచరుల ద్వారా చలామణి చేస్తున్నట్లు ఓంప్రకాశ్ అతనికి చెప్పాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శివరతన్ నకిలీ నోట్లు తరలించేందుకు.. ఓం ప్రకాశ్ రూ. 2.20 లక్షల ఇస్తానని ఆశ చూపాడు. దీంతో నింధితుడు శివరతన్ ఈ అక్రమ రవాణాకు అంగీకరించాడు.
జైపూర్ నుంచి కాచిగూడకు..
అక్టోబర్ 28న జైపూర్ రైల్వే స్టేషన్లో ఓం ప్రకాశ్.. రూ.500 నకిలీ నోట్లతో కూడిన బ్యాగ్‌ను శివరతన్కు అందజేశారు. అందులో మొత్తం 12 కట్టలు ఉండగా, వాటి విలువ 60 లక్షలు ఉన్నాయి. అయితే తొలుత కాచిగూడకు, అక్క డి నుంచి ముంబైకి వెళ్లాలని సూచించారు. దీంతో శివరతన్ మైసూరు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి అక్టోబర్ 30న అర్ధరాత్రి 12.10 గంటలకు కాచిగూడ రైల్వే చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్లో రాత్రి బస చేసి మరుసటి రోజు సికింద్రాబాద్‌కు వచ్చాడు.

రైలు తనిఖీల్లో పట్టుబడి..
వరదల కారణంగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంతో ముంబై ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాలని ఓం ప్రకాశ్ సూచించాడు. దీంతో అక్టోబర్ 31న మధ్యాహ్నం 1.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్ ఫారంపై ఉన్న రైలులోకి జనరల్ కోచ్‌లో శివరతన్ ఎక్కాడు. రైల్వే స్టేషన్లో అనుమానితులపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం 1.30 గంటలకు శివరతన్ అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న నల్లటి బ్యాగును తనిఖీ చేయగా రూ.60 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. విచారణలో ఓం ప్రకాశ్ సూచన మేరకు నకిలీ నోట్లను ముంబైలోని అతడి అనుచరుడికి అందజేయడానికి తీసుకెళ్తున్నట్లు శివరతన్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు మొబైల్ ఫోన్, రైలు ప్రయాణ టిక్కెట్, బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ప్రధాన నిందితుడు
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఓంప్రకాశ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డీఎస్పీ జావెద్ వెల్లడించారు. ఈ అక్రమ కరెన్సీ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా..? ముంబైలో నకిలీ నోట్లను ఎవరికి అందజేయాల్సి ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో రాజస్థాన్ పోలీసు స్టేషన్లో నమోదైన నేర కేసుల్లో ఓంప్రకాశ్ జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సరస్వత్, సిబ్బంది భవానీ శంకర్, బాంబ్ డిటెక్షన్ స్కాడ్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని పట్టుకుని నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్న సిబ్బందిని రైల్వే, రోడ్డు భద్రత విభాగం ఐజీపీ కే.రమేష్ నాయుడు అభినందించి, తగిన బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fake notes
- GRP
- Javed
- Railway DSP
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

