Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన జ్ఞాపకార్థం గోదావరిఖనిలో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Harish Rao | తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ విద్యావేత్త పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. ఆయన జ్ఞాపకార్థం గోదావరిఖనిలో నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు ఎంత ఖర్చయినా పార్టీ భరిస్తుందని వెల్లడించారు.
పీటీ స్వామి దశదిన కర్మ సందర్భంగా ఆదివారం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఆర్కే గార్డెన్స్‌లో నిర్వహించిన సంస్మరణ సభకు హరీశ్‌రావు హాజరయ్యారు. పీటీ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పీటీ స్వామిని కోల్పోవడం ఆయన కుటుంబానికే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి, సింగరేణి కార్మిక లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మరణవార్త విన్న వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ ఎంతో బాధపడ్డారని చెప్పారు. సంస్మరణ సభకు పార్టీ ప్రతినిధులుగా తప్పకుండా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.
కేసీఆర్‌కు పీటీ స్వామి అంటే ఎంతో అభిమానం, గౌరవం ఉండేవని హరీశ్‌రావు గుర్తుచేశారు. సింగరేణిలో బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు చేయాలనే ఆలోచన తొలుత కేసీఆర్‌కు అంతగా నచ్చలేదన్నారు. అప్పటికే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల్లో ఉన్న కార్మికులంతా తెలంగాణ బిడ్డలేనని, ప్రత్యేకంగా మరో సంఘం ఏర్పాటు చేస్తే తెలంగాణ ఉద్యమానికి వారు దూరమయ్యే ప్రమాదం ఉందని కేసీఆర్ భావించారని వివరించారు. అయితే పీటీ స్వామి, కొప్పుల ఈశ్వర్ తదితరులు కేసీఆర్‌ను ఒప్పించి టీబీజీకేఎస్ ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక కార్మిక సంఘం ఏర్పాటుతో ఉద్యమం, పార్టీ బలోపేతం కావడంతో పాటు కార్మికులకు మేలు జరుగుతుందని వివరించారని చెప్పారు. ఈ క్రమంలోనే టీబీజీకేఎస్ ఆవిర్భావానికి పీటీ స్వామి మూలకారకుడిగా నిలిచారని, సంఘం తొలి గౌరవ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారని వెల్లడించారు.
2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన నెల రోజుల్లోపే కొప్పుల ఈశ్వర్, మురళీధర్‌తో పాటు పీటీ స్వామి పార్టీలో చేరారని హరీశ్‌రావు తెలిపారు. అప్పటి నుంచి మరణించే వరకు 26 ఏళ్ల పాటు కేసీఆర్ వెన్నంటి ఉన్నారని చెప్పారు. ఆయనతో కలిసి తాను 14 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో, పదేళ్లు ప్రభుత్వంలో, అనంతరం ప్రతిపక్షంలో పనిచేశానని గుర్తుచేసుకున్నారు.
పీటీ స్వామి నిరంతరం ప్రజా జీవితంలోనే గడిపారని, విశ్రాంతి లేకుండా పనిచేసే నిత్య శ్రామికుడని కొనియాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన అనంతరం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని తెలిపారు. మేధావుల్లో మేధావిగా, కార్మికుల్లో కార్మికుడిగా, విద్యావంతుల్లో విద్యావంతుడిగా అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని పొందారని పేర్కొన్నారు.
దాదాపు 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి పార్టీ సభ్యత్వ నమోదు, ఉద్యమాలు, పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో కృషి చేశారని చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్యం, సుఖం, డబ్బు, పదవుల గురించి ఆలోచించకుండా తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాడారని కొనియాడారు.
మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు ముందే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆదిలాబాద్ జిల్లాను తూర్పు, పశ్చిమ ఆదిలాబాద్‌గా విభజించి పార్టీ బాధ్యతలు అప్పగించామని హరీశ్‌రావు తెలిపారు. తూర్పు ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంత పార్టీ ఇన్చార్జిగా పీటీ స్వామి పనిచేశారని గుర్తుచేశారు. కాగజ్‌నగర్ పేపర్ మిల్లు మూతపడిన సమయంలో అక్కడి కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేశారని వివరించారు.
పీటీ స్వామి సేవలు భావితరాలకు గుర్తుండిపోయేలా గోదావరిఖని గడ్డపై ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొప్పుల ఈశ్వర్, చందర్, రాజిరెడ్డి, స్థానిక పెద్దలను హరీశ్‌రావు కోరారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ఆశీస్సులు ఉంటాయని, విగ్రహ ఏర్పాటుకు ఎంత ఖర్చయినా పార్టీ భరిస్తుందని తెలిపారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు కృషి చేద్దామన్నారు.
పీటీ స్వామి ఆత్మకు నిజమైన శాంతి చేకూరాలంటే ఆయన ఆశయాలను, కార్మికుల కోసం చేసిన కృషిని కొనసాగించాలని అన్నారు. ఆయన ప్రాణప్రదంగా నిర్వహించిన వృద్ధాశ్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొప్పుల ఈశ్వర్, స్థానిక నాయకత్వం, తాను, బీఆర్ఎస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పీటీ స్వామి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Godavarikhani
- harish rao
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

