Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
Sensational Decision | వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టణ పురపాలక ఎన్నికల్లో ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారు.
అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) సంచలన నిర్ణయం ( Sensational Decision ) తీసుకున్నారు. పట్టణ పురపాలక ఎన్నికల్లో ఓటు ( Vote ) వేయకుండానే తిరిగి వెళ్లిపోయారు.
ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు తాడేపల్లి నుంచి శనివారం సాయంత్రం పులివెందుల ( Pulivendula ) కు చేరుకున్న జగన్‌కు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. ఆదివారం పోలింగ్ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాగా పులివెందులలో ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో కూర్చొనివ్వకుండా అడ్డుకున్నారని వైసీపీ ఏజెంట్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
పులివెందుల పరిధిలోని 80 పోలింగ్ కేంద్రాల్లో 70 చోట్ల వైసీపీ ఏజెంట్లు లేరని ఆరోపించారు. దీంతో వైఎస్ జగన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా అతడిని కార్యాలయంలోకి రాకుండా బయటే అడ్డుకున్నారు. అనంతరం అధికారులే బయటకు రావడంతో వారితో జగన్ మాట్లాడారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని, తమ ఏజెంట్లను అడ్డుకున్న వారిపై చట్టరిత్యా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ తన అనుచరులతో కలసి దాదాపు గంటకుపైగా ఆర్వో కార్యాలయం బయట బైటాయించి నిరసన తెలిపారు.
అనంతరం తన నివాసానికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓటు హక్కు వినియో గించుకుంటారని అందరూ భావించారు. పులివెందులలో ఎన్నికల తీరును నిరసిస్తూ ఓటు హక్కు వినియోగాన్ని రద్దు చేసుకున్నారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించినప్పుడే తాను వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటానని మీడియాకు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

