IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
IND vs NZ | హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
IND vs NZ | హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగింది. భారత ఓపెనర్లు సంజూ శాంసన్ (4), అభిషేక్ శర్మ (1) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా మైకేల్ బ్రేస్‌వెల్ వేసిన పదో ఓవర్లో ఏకంగా 27 పరుగులు రాబట్టారు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి భారత స్కోరును పటిష్ఠ స్థితికి చేర్చారు.
ఇషాన్, శ్రేయస్ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించింది. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. నితీశ్ కుమార్ రెడ్డి 17 బంతుల్లో 22 పరుగులు, నామన్ ధీర్ 23 బంతుల్లో 33 పరుగులు చేశారు. అయితే కీలక సమయంలో వీరిద్దరూ కూడా ఔటయ్యారు. చివరి ఓవర్లో ఆడమ్ మిల్నే మరో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను 191 పరుగులకే పరిమితం చేశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్లెయిర్ టిక్నర్ రెండు వికెట్లు, నాథన్ స్మిత్ రెండు వికెట్లు తీశారు. మరోవైపు న్యూజిలాండ్ ఫీల్డర్లు ఈ సిరీస్‌లో క్యాచ్‌లను జారవిడుస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఈ మ్యాచ్‌లోనూ కీలక క్యాచ్‌లను వదిలేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
UDP chief Metbah Lyngdoh | యూడీపీలో మిగిలిన ఒక్క ఎమ్మెల్యే అయిన అధ్యక్షుడు.. మంత్రి పదవికి రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

