RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
RC 17 | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే.
RC 17 | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. తాజాగా చిత్ర బృందం సినిమా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. నీలం, ఆకుపచ్చ, బంగారు రంగుల విస్తృతమైన చిత్రరేఖలతో రామ్ చరణ్ ముఖచిత్రాన్ని రూపొందించారు. ఈ రంగుల అమరిక నెమలి పింఛాన్ని తలపిస్తోంది. పోస్టర్‌పై ‘మీరు ఊహించగలరు.. కానీ అందరి అంచనాలను మించి ఉంటుంది’ అనే ఆసక్తికరమైన కామెంట్ చిత్ర బృందం జోడించింది. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమా కథ, నేపథ్యం ఎలా ఉండబోతున్నాయనే చర్చ మొదలైంది. సుకుమార్ తనదైన శైలిలో మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారా? అనే ఊహాగానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ప్రీ లుక్ ద్వారా కథకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సాంకేతిక విభాగంలోనూ ప్రముఖులు పనిచేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. ఈ కలయిక సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర బృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కథ, రామ్ చరణ్ పాత్ర, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- pre look
- ram charan
- RC 17
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
Karepalli | మాజీ ప్రిన్సిపల్ దారా సావిత్రి అకాల మృతి విద్యారంగానికి తీరని లోటు
Anupama Parameswaran | నాతో క్షమాపణలు చెప్పించారు.. ఇప్పుడు అవే పనులు బహిరంగంగా చేస్తున్నారు: అనుపమ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

