Harish Rao : రేవంత్ సర్కారు ప్రజల ఆస్తులను 22ఏ కింద నిషేధిత జాబితాలో పెట్టడంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బాధితులు ఇవాళ తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు వారికి భరోసా ఇచ్చారు. 22A బాధితులెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తామంతా మీకు అన్ని వేళలా అండగా ఉంటామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు తెలంగాణభవన్‌లో 10 మంది న్యాయవాదులతో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లీగల్ సెల్ సపోర్ట్‌తోపాటు ఎమ్మెల్యేలుగా తాము కూడా అధికారులతో, కలెక్టర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేదాకా అండగా ఉంటామని అన్నారు.