తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామంలో ముస్లిం సోదరులు గ్యార్మీ పండుగ ( Gyaarmi Flag Festival ) ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలోని జామా మసీద్ ఇమామ్ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో గ్యార్మీ పండుగ వేడుకలు కోలాహలంగా జరిగాయి.
ఈ సందర్భంగా గ్యారీ కమిటీ సభ్యులు తాండూరు, తంగళ్లపల్లి, ఐబీలో మేళతాళాలు, డప్పు, సన్నాయి వాయిద్యాల నడుమ సందల్ ఉరేగింపు నిర్వహించారు. దర్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ గ్యార్మీ పండుగను హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా లేకుండా కలిసికట్టుగా జరుపుకున్నారు. దర్గా వద్ద శనివారం అన్నదాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూర్, ఐబీ, తంగళ్ళపల్లి మసీదు కమిటీల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.