అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు ( Guvvala Balaraju ) జన్మదిన వేడుకలను ( Birthday celebrations ) అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్, కడ్తాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జన్మదిన వేడుకలను జరిపారు. బల్మూరు మండలంలోని జినుకుంట కనకాల మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమామహేశ్వరం క్షేత్రంలో పూజలు, రంగాపూర్ నిరంజన్ షావలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అచ్చంపేటలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చౌరస్తాలో కేక్ కట్ చేశారు. జై జీబీఆర్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. టాంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆవులోనిబావి మధునాగుల మహేందర్ ఆధ్వర్యంలో 200 మంది పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, ఆర్టీసీ డిపో పక్కన ఉన్న వృద్ధుల ఆశ్రమంలో 20 మంది వృద్ధులకు చీరలు, పంచేలను పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
హైదరాబాదులోని అల్మాస్ గూడ ఏవైఆర్ క్రికెట్ మైదానంలో గువ్వల బాలరాజు పుట్టినరోజు సందర్భంగా రాజు నాయక్ అనే యువకుడు కేక్ కట్ చేశారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహగౌడ్ వేడుకలలో పాల్గొని టోర్నమెంటు ప్రారంభించారు. గువ్వల బాలరాజు విదేశీ పర్యటనలో ఉండగా పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో నాయకులు అమినోద్దీన్, కౌన్సిలర్ రమేష్ రావు, కుబుద్దీన్, అంతటిశివ, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్ మాదిగ, రాష్ట్ర నాయకులు కేటి తిరుపతయ్య, మధునాగుల మహేందర్, మాజీ జెడ్పిటిసి రాంబాబు, లింగాల, బల్మూర్, ఉప్పునూతల సింగిల్ విండో చైర్మన్లు హనుమంతు రెడ్డి, నరసయ్యయాదవ్, భూపాల్ రావు, అచ్చంపేట, బల్మూర్ మాజీ ఎంపీపీలు పర్వతాలు, కర్ణాకర్రావు, అమ్రాబాద్, ఉప్పునుంతల మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రావు, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
మాజీ మండల రైతు సమితి అధ్యక్షుడు రామష్ పల్లి బండపల్లి వెంకటయ్య, సీనియర్ నాయకులు చెన్నకేశవులు, మాజీ సర్పంచులు బాలునాయక్, కృష్ణయ్య,శివ, శ్రీరామ్ నాయక్, వంశీనాయక్, వెంకటయ్య, వసురం, భాస్కర్, కార్తీక్, రాము, రవి, రహమతుల్లా, ఖలీల్, పిల్లి బాలరాజు, తిరుపతయ్య, వెంకటేష్, నిరంజన్ యువకులు, నాయకులు హాజరయ్యారు.